Monday 31 October 2011

Avenues in Agriculture

Beyond Profession
మాన్యశ్రీ శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి జన్మభూమి స్ఫూర్తి తో పల్లె ప్రజలకు వారు నివసిస్తున్న గ్రామాల్లోనే ఉపాధి ఎలా కల్పించాలి అని దీర్ఘంగా ఆలోచన చేయగా నా మదిలో మెదిలిన ఒక ఆలోచనే నా చిన్న ప్రయత్నం.
పట్టణాలలో ఈరోజు నివసిస్తున్న చాలా మంది ఒకప్పుడు గ్రామాల నుంచి ఉపాధిని ఎదుక్కుంటూ వలస వచ్చిన వారెఅలాంటి వారి లో ఈరోజు ఉన్నత మైన స్థానాలలో ఉండి,  ఉన్నత మైన సంపాదన కలిగి నటువంటి వారు అందరూ వారి వారి జన్మభూముల నందు ఇండస్ట్రీస్ స్థాపించి వారి యొక్క గ్రామ ప్రజలకు ఉపాధి ని కల్గించ లేక పోవచ్చును. కాని,  వారి సంపాదన లో భవిష్యతు అవసరాల కోసం షేర్లు, బ్యాంకు డిపోజిట్స్, ఇండ్ల స్థలాలు, బంగారం, వెండి మొదలగు వాటి లో పెట్టుబడులు పెట్టే బదులు గా, వారి యొక్క గ్రామాలలో  వ్యవసాయ  రంగం మరియు భూములనందు  పెట్టుబడులు పెట్టి,  గ్రామీణ వ్యవసాయ కూలీలకు ఉపాధి ని కలిగించ వచ్చును మరియు గ్రామీణ వ్యవసాయ భూములకు డిమాండ్ నీ కలిగించ వచ్చును అని ఘాడంగా  నమ్మి, నా 25 సం. సర్వీసు లో కూడ భెట్టిన సొమ్మునంతా ఎప్పటి కప్పుడు మరే విధమైన పెట్టుబడులు వైపు చూడ కుండా ఒక వ్యవసాయ భూములనందే సుమారు 8 గ్రామాలలో పెట్టుబడులు గా పెట్టి, వాటిని అలానే బంజరు భూములుగా విడిచి పెట్ట కుండా  నెలకు సుమారు రూ. 40 వేల రూపాయలు వరకు నా జీతం సొమ్ము లోంచే వెచ్చిస్తూ లాభాపేక్ష లేకుండా  నిరంతరం వాటిని అభివృద్ధి పరుస్తూ, ఒక ప్రక్క నా రైతులకు గల నైపుణ్యాలను ఉపయోగించు కుంటూ  మరి యొక  ప్రక్క నేను ఇంటర్నెట్ మరియు బుక్స్ చదివి వ్యవసాయం నందు జ్ఞానం సంపాదించు  కొంటూ నేను నెలకొక సారి నా భూములకు  వెళ్లి 3 రోజులు అక్కడ ఉండి వారి కి ట్రైనింగ్ ని ఇచ్చుకుంటూ మరియూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ వ్యవసాయం చేస్తూ మరియూ పండ్ల తోటలు పెంచుతూ నేను ఈ కార్య క్రమం ద్వారా సుమారు 20 కుటుంబాలకు వారు వారు నివసిస్తున్న గ్రామాలలోనే ఉపాధిని కలిగిస్తున్నాను. నాకు పంటలు ద్వారా తగినటు వంటి ఆదాయం లేకున్నను కాపిటల్ అప్ప్రిసిఏషన్ ద్వారా నా మూ   నం పెట్టు బడి కి ఇతర పెట్టు బడులుకు తీసు పో కుండా  రోజు నా ఆస్తి విలువ పెరిగింది.
మనలాంటి వాళ్ళు సంపాదన లో కొంచెం  సొమ్ము మరియా కొంచెం నాలెడ్జి ని పెట్టుబడులుగా పెడితే వ్యవసాయ రంగం లో అధ్బుతాలు సృస్టించ వచ్చును అని నేను దీని ద్వారా  నిరూపణ చేయడం జరిగింది.  

 పండ్ల తోటలు పెంచే రైతులు మొక్కలను వ్యాపార నర్సరీ  నుంచి ఖరీదు చేసి వాటిని వాళ్ళ భూములలో నాటి, ఆరు గాలం శ్రమించి సుమారు 5 సం. లు    పెంచిన తరువాతకాపు కాచే అంత వరకు గాని  వాళ్ళకు తెలియదు, నాటిన  మొక్కలు  నాణ్యమైనవాకావాఅనిచాలా సార్లు రైతులు  మోసపోతుంటారు.  తోటి రైతులకు వారి వారి భూములు అభివృద్ధికి సహాయ పడవలెనని తలంచి మా స్వంత పండ్ల తోటలలో బాగా కాపు కాచే చెట్ల విత్తనములు సేకరించి సేంద్రియ వ్యవసాయ పద్ధతి లో మొక్కలను అభివృద్ధి చేసి లాభాపేక్ష లేకుండా సరఫరా చేయుచున్నాము.  
                                                    
ఈమధ్య కాలంలో జరిగే రైతుల ఆత్మహత్యలతో కలత చెంది వాటికి గల మూల కారణాలను పరిశోధించి ముఖ్య కారణమైన అధిక పెట్టుబడిని తగ్గించే దిశగా  ICRISAT  (ఇక్రిసాట్శాస్త్రవేత్తల సహకారం తో  బయో ఫెర్టిలిజేర్  నాణ్యత మరియు మాములు ఫెర్టిలిజేర్ ఖరీదు తో  ఉండే విధంగా సేంద్రియ ఎరువులను  రూపొందించే    ప్రయత్నాలు ముమ్మరం గా చేస్తున్నాము.      
మనం భూమిని తప్ప  వస్తువునైన తయారు చేయగలం కావున భూమికి ఎప్పటికీ డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది కావున భూముల ఖరీదు ఎప్పటికీ పెరగటమే కాని తరగటం ఉండదుఅలా అని ఇండ్ల స్థలాల మీద పెట్టుబడి పెడితే అవి అన్యాక్రంతమైయ్యే  చాన్సులు ఎక్కువ మరియు వ్యవసాయ భూములైతే ఇటు మనం మరియా అటు రైతు లాభ పడతారు. మరియు మనం అప్పుడు అప్పుడు  అంటే నెలకొక సారి వెళ్లి ఒక రెండు మూడు రోజులు అక్కడ గడిపితే మనకు అది " stress  burster "  కూడా ఉపయోగ పడుతుంది.  
నా ప్రయత్నం లో నేనే కాకుండా తోటి స్నేహితులను మరియు తోటి ఉద్యోగులను ప్రొత్సహిస్తూవారికి కావలిసిన  సహకారం అందిస్తూ, వారిచేత కూడా వ్యవసాయ భూములలో పెట్టుబడులు  పెట్టిస్తూ అటు రైతుల అభివృద్ధికి ఇటు తోటి వారి అభివృద్ధికి తోడ్పాటు ని అందిస్తున్నాను.
legacy ని నా తరువాత తరం కూడా కంటిన్యూ చేయాలనే తలంపు తో నేను  నా కుటుంభం  మొత్తం సంనకు కనీసం 2  సార్లు మా భూములకు వెళ్లి కనీసం 3 - 4  రోజులు  అక్కడ గడిపి మా  పిల్లలకు    వ్యవసాయం పట్ల మక్కువని కలిగిస్తున్నాను.